Our Earth In The Solar System – Study Notes

6వ తరగతి – సౌర కుటుంబంలో మన భూమి
🌟
పరిచయం: సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరిసే వస్తువులు, మన భూమి… వీటన్నింటినీ కలిపి ‘ఖగోళ వస్తువులు’ (Celestial Bodies) అంటారు.

1. నక్షత్రాలు & నక్షత్ర రాశులు

⭐ నక్షత్రాలు (Stars)

ఇవి చాలా పెద్దవి మరియు వేడిగా ఉండే వాయు గోళాలు. ఇవి సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉంటాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే.

✨ నక్షత్ర రాశులు (Constellations)

వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన ఆకారాలను నక్షత్ర రాశులు అంటారు.

  • ఉర్సా మేజర్ (Ursa Major): దీనిని బిగ్ బేర్ అంటారు.
  • సప్తర్షి (Saptarshi): 7 నక్షత్రాల సమూహం.
  • ధృవ నక్షత్రం (Pole Star): ఇది ఎల్లప్పుడూ ఉత్తర దిక్కును సూచిస్తుంది.

2. సౌర కుటుంబం (Solar System)

సూర్యుడు యజమానిగా, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు కలిసి ‘సౌర కుటుంబం’ ఏర్పడింది.

☀️
సూర్యుడు (The Sun): సౌర కుటుంబానికి మధ్యలో ఉంటాడు. అయస్కాంత శక్తితో గ్రహాలను తన వైపు లాగి ఉంచుతాడు. భూమికి 15 కోట్ల కి.మీ దూరంలో ఉన్నాడు. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది.

🪐 గ్రహాలు (Planets) – 8

సూర్యుని నుండి దూరం ఆధారంగా గ్రహాల వరుస క్రమం:

Sun Budhudu Shukrudu Bhumi Angarakudu …. Bruhaspati Shani Indrudu Varunudu
వర్గం గ్రహాలు లక్షణాలు
అంతర గ్రహాలు
(Inner Planets)
బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు సూర్యునికి దగ్గరగా ఉంటాయి. రాళ్లతో నిండి ఉంటాయి. చిన్నవి.
బాహ్య గ్రహాలు
(Outer Planets)
బృహస్పతి, శని, ఇంద్రుడు (Uranus), వరుణుడు (Neptune) సూర్యునికి దూరంగా ఉంటాయి. వాయువులు, ద్రవాలతో నిండి ఉంటాయి. పెద్దవి.
💡 ట్రిక్: “My Very Educated Mother Just Served Us Noodles” (M-V-E-M-J-S-U-N)
🌎 ట్విన్ ప్లానెట్: శుక్రుడిని (Venus) “భూమికి కవల గ్రహం” అంటారు.

3. మన భూమి & చంద్రుడు

🌍 భూమి (Earth)

  • స్థానం: సూర్యుని నుండి 3వ గ్రహం. పరిమాణంలో 5వ పెద్ద గ్రహం.
  • ఆకారం: ధృవాల వద్ద చదునుగా, మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. దీనిని ‘జియోయిడ్’ (Geoid) అంటారు.
  • నీలి గ్రహం: 2/3 వంతు నీటితో కప్పబడి ఉంది కాబట్టి ‘Blue Planet’ అంటారు.
  • ఆవరణాలు: శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం.

🌙 చంద్రుడు (Moon)

  • భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం.
  • దూరం: 3,84,000 కి.మీ.
  • కాలం: భూమి చుట్టూ తిరగడానికి, తన చుట్టూ తాను తిరగడానికి 27 రోజులు పడుతుంది. అందుకే మనకు చంద్రుని ఒక వైపు మాత్రమే కనిపిస్తుంది.
  • మొదటి వ్యక్తి: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (జూలై 21, 1969).

4. ఇతర ఖగోళ వస్తువులు

☄️ గ్రహ శకలాలు (Asteroids)

గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు. ఇవి అంగారకుడు, బృహస్పతి కక్ష్యల మధ్య ఎక్కువగా ఉంటాయి.

🔥 ఉల్కలు (Meteoroids)

సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లు. ఇవి భూమి వాతావరణంలోకి వచ్చినప్పుడు రాపిడి వల్ల కాలిపోయి ‘షూటింగ్ స్టార్స్’ లా కనిపిస్తాయి.

🌠 తోకచుక్కలు (Comets)

తల మంచుతో, తోక వాయువులతో ఉంటుంది.
హేలీ తోకచుక్క: ప్రతి 76 ఏళ్లకు కనిపిస్తుంది (చివరిగా 1986లో, మళ్ళీ 2061లో).

5. గెలాక్సీ & విశ్వం

🌌
  • గెలాక్సీ (Galaxy): కోట్ల నక్షత్రాల సమూహం. మన గెలాక్సీ పేరు ‘పాలపుంత’ (Milky Way) లేదా ఆకాశగంగ.
  • విశ్వం (Universe): కోట్లాది గెలాక్సీల సమూహమే విశ్వం.
🚀 కృత్రిమ ఉపగ్రహాలు: ఇవి మానవ నిర్మితమైనవి. సమాచారం కోసం పంపిస్తారు. (ఉదా: INSAT, IRS, ఆర్యభట్ట, మంగళయాన్-MOM).