Mughal Empire (మొఘల్ సామ్రాజ్యం )క్విజ్ -2:

1. హిందువులపై విధించే ‘జిజియా పన్ను’ మరియు ‘యాత్రికుల పన్ను’లను రద్దు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు?

2. ఔరంగజేబు, ఇస్లాం సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి నియమించిన మతాధికారులను ఏమని పిలుస్తారు?

3. భారతదేశంలో ‘జిజియా పన్ను’ను మొదటగా ప్రవేశపెట్టిన బానిస వంశస్థాపకుడు ఎవరు?

4. ‘యాత్రికుల పన్ను’ (Pilgrim Tax) అంటే ఏమిటి?

5. అక్బర్ క్రీ.శ. 1575 లో ఫతేపూర్ సిక్రీ వద్ద నిర్మించిన ప్రార్థనా మందిరం పేరు ఏమిటి?

6. అక్బర్ క్రీ.శ. 1582లో ప్రకటించిన నూతన మతం ‘దీన్-ఇ-ఇలాహి’ యొక్క అర్థం ఏమిటి?

7. అక్బర్ ప్రకటించిన ‘దీన్-ఇ-ఇలాహి’ మతంలో ఎంతమంది మాత్రమే చేరారు మరియు ఇది ఎందుకు ప్రజాదరణ పొందలేకపోయింది?

8. మొఘలుల కాలంలో ప్రజల ముఖ్య వృత్తి ఏది?

9. షేర్షా సూర్ ప్రవేశపెట్టి, మొఘలులు కొనసాగించిన వెండి నాణెం పేరు ఏమిటి?

10. అక్బర్ కాలంలో అత్యంత సాధారణ నాణెంగా చలామణిలో ఉన్న ‘దామ్’ ఏ లోహంతో చేయబడింది?

11. మొఘలుల పాలనలో భారతీయ రైతులు విస్తృతంగా పండించడం ప్రారంభించిన కొత్త వ్యాపార పంటలు (Cash Crops) ఏవి?

12. అక్బర్ కాలంలో రెవెన్యూ పాలనను అభివృద్ధి చేసిన అతని ప్రముఖ రెవెన్యూ మంత్రి ఎవరు?

13. అక్బర్ ప్రవేశపెట్టిన ‘జబ్త్’ (Zabt) విధానంలో, భూమి శిస్తును ఎలా నిర్ణయించేవారు?

14. ‘జబ్త్’ విధానం ప్రకారం, శిస్తును ఉత్పత్తిలో 1/3 వంతు నుండి సగం వరకు నిర్ణయించారు. ఈ శిస్తును ఏ ద్రవ్య రూపంలో చెల్లించాలి?

15. మొఘలుల వాస్తు శిల్పంలో భవనాలను అలంకరించడానికి పాలరాళ్ళతో పాటు వేటిని ఉపయోగించారు?

16. అక్బర్ తన రాజధానిని ఆగ్రా నుండి ఫతేపూర్ సిక్రీకి మార్చడానికి గల కారణం ఏమిటి?

17. అక్బర్ గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థంగా ఫతేపూర్ సిక్రీలో నిర్మించిన ఎత్తైన నిర్మాణం ఏది?

18. ఫతేపూర్ సిక్రీలో ఉన్న అద్భుతమైన నిర్మాణశైలి గల ఐదు అంతస్థుల భవనం పేరు ఏమిటి?

19. మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క రాజధాని అయిన ‘షాజహానాబాద్’ లో నిర్మించిన రాజకుటుంబ అంతఃపుర భవనం ఏది?

20. షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రేమకు గుర్తుగా, ఆగ్రాలో యమునా నది ఒడ్డున నిర్మించిన తెల్ల పాలరాతి సమాధి ఏది?

21. మొఘలుల కాలంలో యువకులకు ఖురాన్ మరియు ఇస్లామిక్ చట్టాలను (ఉదా: ఫత్వా-ఇ-ఆలంగిరీ) స్వదేశీ భాషలలో బోధించడానికి నిర్మించిన పాఠశాలలను ఏమని పిలిచేవారు?

22. మొఘలుల సంస్కృతిలో భాగంగా, పర్షియన్ కళ మరియు సాహిత్యాలు ఏ కళతో సమ్మిళితం చెందాయి?

23. మొఘల్ సామ్రాజ్యం యొక్క అధికార భాష ఏది?

24. ‘అయిన్-ఇ-అక్బరి’ మరియు ‘అక్బర్ నామా’ గ్రంథాలను రచించిన అక్బర్ కాలంలోని గొప్ప పండితుడు ఎవరు?

25. ‘తుజుక్-ఇ-జహంగీరీ’ లేదా ‘జహంగీర్ నామా’ అనేది ఎవరి స్వీయ చరిత్ర (Autobiography)?

26. భగవద్గీత మరియు మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించిన షాజహాన్ కుమారుడు ఎవరు?

27. రామాయణాన్ని ‘రామచరితమానస్’ అనే పేరుతో హిందీలో రచించిన ప్రముఖ కవి ఎవరు?

28. మొఘలుల కాలంలో ‘మినియేచర్ పెయింటింగ్’ (సూక్ష్మ చిత్రకళ) ఏ పాలకుడి పోషణలో అత్యున్నత స్థాయికి చేరుకుంది?

29. ‘మేఘ మల్హర్’ రాగంతో వర్షాన్ని, ‘దీపక్ రాగం’తో అగ్నిని సృష్టించగలడని ప్రతీతి పొందిన, అక్బర్ నవరత్నాలలో ఒకడైన గొప్ప సంగీతకారుడు ఎవరు?

30. అక్బర్ చక్రవర్తి స్వయంగా ఏ వాయిద్యాన్ని బాగా వాయించేవాడు?

మీ స్కోరు: 0 / 30