Kingdoms and Empires – Study Notes

రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు – నోట్స్

రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

6వ తరగతి – సాంఘిక శాస్త్రం (సెమిస్టర్ 2)

📜

పరిచయం

షోడశ మహాజనపదాలలో మగధ అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఆవిర్భవించింది.

🔹 రాజ్యం: ఒక రాజుచే పరిపాలించబడే భూభాగాన్ని ‘రాజ్యం’ అంటారు.
🔹 సామ్రాజ్యం: సువిశాలమైన రాజ్యాలను ‘సామ్రాజ్యాలు’ అంటారు.

🏛️

మౌర్య సామ్రాజ్యం (322-187 B.C.E)

స్థాపన: చంద్రగుప్త మౌర్యుడు, చాణక్యుని (కౌటిల్యుడు) సహాయంతో నందవంశ రాజు ధననందుని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
రాజధాని: పాటలీపుత్రం.
గ్రంథం రచయిత వివరణ
ఇండికా మెగస్తనీస్ గ్రీకు రాయబారి. మౌర్యుల పాలన గురించి తెలుపుతుంది.
అర్థశాస్త్రం కౌటిల్యుడు (చాణక్యుడు) చంద్రగుప్తుని ప్రధానమంత్రి. రాజనీతి గురించి తెలుపుతుంది.

⚔️ అశోకుడు – కళింగ యుద్ధం

అశోకుడు మౌర్యవంశంలో గొప్ప చక్రవర్తి. కళింగ (ప్రస్తుత ఒడిశా) రాజ్యంపై యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో జరిగిన భారీ ప్రాణనష్టం, రక్తపాతం చూసి చలించిపోయాడు. భవిష్యత్తులో యుద్ధం చేయకూడదని నిర్ణయించుకుని, బౌద్ధమతాన్ని స్వీకరించి అహింస మార్గాన్ని ఎంచుకున్నాడు.

🕊️ అశోక ధర్మ సూత్రాలు

  • జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి.
  • తల్లిదండ్రులు, పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలి.
  • పేదల పట్ల సానుభూతి చూపాలి.
  • ఇతర మతాలను విమర్శించరాదు.
సారనాథ్ లోని అశోకుని స్తూపం పై ఉన్న నాలుగు సింహాల గుర్తు మన జాతీయ చిహ్నం. దీని క్రింద “సత్యమేవ జయతే” అని ఉంటుంది.

ప్రజా సంక్షేమం

అశోకుడు రహదారుల పక్కన చెట్లు నాటించాడు, బావులు తవ్వించాడు, మనుషులకు మరియు జంతువులకు వైద్యశాలలు నిర్మించాడు.

👑

గుప్త సామ్రాజ్యం (319-543 C.E)

గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో “స్వర్ణయుగం” (Golden Age) అంటారు.

ముఖ్యమైన రాజులు

  • మొదటి చంద్రగుప్తుడు: గుప్త వంశ ప్రసిద్ధ రాజు.
  • సముద్రగుప్తుడు: అపజయం ఎరుగని వీరుడు. ఉత్తర భారతంలో 9 మందిని, దక్షిణాన 12 మంది రాజులను ఓడించాడు.
  • రెండవ చంద్రగుప్తుడు: ఇతని ఆస్థానంలో ‘నవరత్నాలు’ అనే తొమ్మిది మంది కవులు ఉండేవారు.

💎 నవరత్నాలు & శాస్త్రవేత్తలు

పేరు రంగం / ఆవిష్కరణ
కాళిదాసు ప్రసిద్ధ సంస్కృత కవి (అభిజ్ఞాన శాకుంతలం).
ఆర్యభట్టు సున్న (0) కనుగొన్నారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని, సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పారు.
వరాహమిహిరుడు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త.
సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొదటి భారతీయ వైద్యుడు.
చరకుడు ‘చరక సంహిత’ (ఆయుర్వేద గ్రంథం) రచించారు.

లోహశాస్త్రం: గుప్తుల కాలంలో ఇనుము, ఉక్కు తయారీలో అద్భుతమైన ప్రగతి సాధించారు. మెహ్రౌలీ ఇనుప స్తంభం దీనికి నిదర్శనం.

దక్షిణ భారతదేశ రాజ్యాలు

1. శాతవాహనులు

దక్కన్ ప్రాంతంలో (నర్మదా నుండి కృష్ణా, గోదావరి వరకు) పాలించారు.
రాజధాని: ధాన్యకటకం (అమరావతి).

  • గౌతమీపుత్ర శాతకర్ణి: గొప్ప రాజు. ‘త్రిసముద్రాధీశ్వర’ అనే బిరుదు కలదు.
  • వ్యాపారం: రోమ్ దేశంతో వర్తకం చేసేవారు. ఓడ గుర్తు ఉన్న నాణేలు వీరి నౌకాదళ శక్తిని సూచిస్తాయి.
  • మతం: బౌద్ధమతాన్ని ఆదరించారు (అమరావతి, నాగార్జునకొండ).

2. ఇక్ష్వాకులు

  • రాజధాని: విజయపురి (నాగార్జునకొండ).
  • వీరు తాము శ్రీరాముని వారసులమని చెప్పుకుంటారు.
  • ఇక్ష్వాక స్త్రీలు బౌద్ధారామాలకు విరాళాలు ఇచ్చారు.
🛕

వాస్తుశిల్ప కళా వికాసం

3. పల్లవులు (కంచి)

రాజధాని: కాంచీపురం (తమిళనాడు).

మహేంద్రవర్మ-I రాతిని తొలిచి నిర్మించిన గుహాలయాలు.
నరసింహవర్మ-I మహాబలిపురంలో ‘పంచపాండవ రథాలు’ (ఏకశిలా రథాలు).
రాజసింహుడు కాంచీపురంలో కైలాసనాథ ఆలయం.

4. చాళుక్యులు (బాదామి)

రాజధాని: బాదామి (కర్ణాటక).

  • రెండవ పులకేశి: హర్షవర్ధనుడిని ఓడించాడు. ఈ విజయం గురించి రవికీర్తి ‘ఐహోలు శాసనం’లో పేర్కొన్నాడు.
  • వాస్తుశైలి: ‘వెశారా’ శైలి (నగారా + ద్రావిడ మిశ్రమం).
  • పట్టడగల్: ఇక్కడ విరూపాక్ష (ద్రావిడ), పాపనాథ (నగారా) ఆలయాలు ప్రసిద్ధి.